‘మీ అహంకారం 4 రోజులే’… రెబల్స్నుద్దేశించి సంజయ్ రౌత్ ఇంటి వద్ద బ్యానర్
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటి వద్ద ఒక బ్యానర్ కనిపింది. ‘మీ అహంకారం 4 రోజులే ఉంటుంది. మా రాజ్యం వారసత్వంగా వచ్చింది’ అని అందులో ఉంది. ఈ మేరకు తిరుగుబాటు నేతలకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. శివసేన కార్పొరేటర్ దీప్మలా బాధే ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లో ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బాలసాహేబ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్తోపాటు ఇతర శివసేన ప్రముఖుల ఫొటోలున్నాయి.
మరోవైపు ఏక్నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం తెలిపారు. బూడిద నుంచి కూడా పైకి లేచే సత్తా శివసేనకు ఉందన్నారు. షిండే పాత శివ సైనికుడన్న ఆయన, తాము షిండేని విడిచిపెట్టలేమని, ఆయన కూడా తమను విడిచిపెట్టలేరని అన్నారు. ‘గవర్నర్కు కరోనా వచ్చింది. కాబట్టి వేచి ఉండి సంఖ్యలను చూద్దాం. ఏక్నాథ్ షిండే శివ సైనికుడు, ఆయనతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నేను ఆయనతో ఒక మాట చెప్పాను. గంట వరకు మాట్లాడాం. ఇందులో దాచేందుకు ఏమీ లేదు. శివసేనలో ఎలాంటి సమస్య లేదు. తిరుగుబాటుదారులంతా పార్టీతోనే ఉంటారు’ అని సంజయ్ రౌత్ అన్నారు.
Maharashtra | A banner, reading 'Your arrogance would last 4 days, our kingship is inherited', seen outside the residence of Shiv Sena leader Sanjay Raut in Mumbai.
The banner has been put up by Shiv Sena Corporator Deepmala Badhe. pic.twitter.com/N4WkJA0riB
— ANI (@ANI) June 22, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

