భోపాల్, నవంబర్ 20: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుం డా పోయింది. పట్టపగలే ఓ యువతి అపహరణకు గురయ్యారు. ఈ ఘటన గ్వాలియర్లో చోటుచేసుకున్నది. ఓ యువతి త న బంధువులతో కలిసి గ్వాలియర్లో బ స్సు దిగారు. ఈ సమయంలో బైక్పై ఒక వ్యక్తి సిద్ధంగా ఉండగా.. మరో వ్యక్తి సద రు యువతిని ఈడ్చుకెళ్లి బైక్పై కూర్చోబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సందర్భంగా ఆ యువతి కేకలు వేస్తున్నా ఎవరూ కాపాడలేకపోయారు. వెంటనే ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గాలింపు చేపడుతున్నారు. పోలీసులు స్పందిస్తూ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.