పాట్నా: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. పాట్నాలోని గార్దానీబాగ్లో ఆదివారం సమావేశానికి పిలుపునిచ్చిన రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయవేత్తగా మారిన ప్రశాంత్ కిషోర్‌పై (Prashant Kishor) వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీచార్జి తర్వాత పరామర్శకు వచ్చిన ఆయనతో వారు వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని నిలదీశారు. ‘మీకు దుప్పట్లు ఇచ్చాను. నన్నే విమర్శిస్తున్నారు’ అన్న ప్రశాంత్ కిషోర్‌పై అభ్యర్థులు మండిపట్టారు. ‘మీరు మాకు దుప్పట్లు ఇచ్చారు. ఆ తర్వాత మీ వైఖరిని చూపించారు’ అని విమర్శించారు. పోలీసుల లాఠీఛార్జి సమయంలో ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ‘ప్రశాంత్ కిషోర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఆర్జేడీ కూడా ఆయన తీరును విమర్శించింది.
కాగా, నిరసనకు తరలివచ్చిన అభ్యర్థులు వెళ్లిపోవాలని సూచించిన తర్వాతే తాను అక్కడి నుంచి వెళ్లినట్లు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ వివరించారు. తాను వెళ్లిన 45 నిమిషాల తర్వాత వారిపై లాఠీచార్జి జరిగిందని తెలిపారు. పోలీసుల చర్యను ఆయన ఖండించారు. పాట్నా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసం కోర్టుతోపాటు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని తెలిపారు.
మరోవైపు బీపీఎస్సీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థుల సమస్య పరిష్కారానికి ప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేయాలని ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనవరి 2 నుంచి అభ్యర్థుల నిరసనలో తాను కూడా పాల్గొంటానని ఆయన హెచ్చరించారు.
दो कौड़ी के बाज़ारू लोग राजनीति को भी दुकानदारी समझ बैठे है। जैसे अपने पेड स्टाफ सह पेड कार्यकर्ताओं पर धौंस जमाते है वैसे ही जनता को समझ लिया है। इ बिहार है बाज़ारू बाबू- बीजेपी के पैसे से यहाँ वोट और मुद्दा नहीं बंटेगा pic.twitter.com/Wx0YGXNKPV
— Rashtriya Janata Dal (@RJDforIndia) December 30, 2024