Supreme Court: వాట్సాప్ ప్రైవసీ పాలసీ.. మెటా కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court: వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. మా దేశ విధానాలను పాటించలేకుంటే, మీరు వెళ్లిపోవచ్చు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రైవసీ అంశంలో తమ డేటాను వాడుకోవద్దు అని తెలిపారు.
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం, వాట్సాప్ ఓనర్లు మెటా కంపెనీకి .. ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో కోర్టు తన హెచ్చరిక జారీ చేసింది. ఓ కేసులో ఇవాళ సుప్రీంలో వాదనలు జరిగాయి. మా దేశ ప్రైవసీతో మీరు ఆటలాడుకోలేరని, మాకు చెందిన సింగిల్ డిజిట్ డేటాను కూడా షేర్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని, మా దేశ చట్టాలను ఫాలో అవ్వకుంటే, మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్లవచ్చు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీపై కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. యూజర్ డేటాను కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. మా రాజ్యాంగాన్ని అనుసరించలేని పక్షంలో.. ఇండియాను వదిలివెళ్లాలన్నారు. పౌరుల గోప్యతను బహిరంగ పరచడాన్ని అమనుతించబోమన్నారు. ప్రైవసీ పాలసీ నిరక్ష్యరాసులకు ఎలా అర్థం అవుతుందని కోర్టు ప్రశ్నించింది. కొన్ని సందర్భాల్లో మీ పాలసీలు అర్థం చేసుకోవడం మాకే ఇబ్బందిగా మారుతుందని, అలాంటప్పుడు గ్రామీణ భారత దేశ ప్రజలకు ప్రైవసీ ఎలా అర్థం అవుతుందని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

