‘బుల్డోజర్ బాబా’… సీఎం యోగికి కొత్త పేరు పెట్టిన అఖిలేష్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కొత్త పేరు పెట్టారు. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించిన యోగికి ‘బుల్డోజర్ బాబా’గా అఖిలేష్ యాదవ్ పేరు పెట్టారు. ఆదివారం అయోధ్యలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఐదేండ్ల బీజేపీ పాలనలో పేర్లు మార్చడం తప్ప సీఎం యోగి చేసిందేమీ లేదని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. అందుకే ఆయనకు ‘బుల్డోజర్ బాబా’గా పేరు పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
కాగా, బీజేపీ నేతలు ఇప్పుడు ఏబీసీడీలు నేర్చుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ప్రజలు వెనక్కి తీసుకెళ్తారని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఆ పార్టీని తొలగించడం ఖాయమన్నారు. ప్రజలు తమపై ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ కూడా గ్రహించిందని, అందుకే వారి భాష, ప్రవర్తన మారిపోయిందని దుయ్యబట్టారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం మూడో దశ పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో కర్హల్ నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్, ఆయన భార్య జస్వంత్నగర్లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కూడా అదే పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Etawah | Samajwadi Party (SP) founder-patron Mulayam Singh Yadav arrives at a polling booth in Jaswantnagar, Saifai to cast his vote for the third phase of #UttarPradeshElections2022 pic.twitter.com/k59H8zsnEC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

