గత నాలుగేళ్లలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్తులు పెరిగాయి. దాదాపు 59 లక్షల రూపాయలు పెరిగాయి. ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో యోగి ఆస్తుల విలువ 95.98 లక్షల రూపాయలు. ఇప్పుడు కోటి 54 లక్షల 94 వలే 54 రూపాయలు. అదేవిధంగా 2014 లో ఎంపీగా ఉన్న సమయంలో యోగి ఆస్తులు 72 లక్షల 17 వేల రూపాయలే. యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా యోగి తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఇక తనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదని యోగి అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తన వద్ద లక్ష రూపాయలు విలువ చేసే ఓ రివాల్వర్ కూడా ఉందని, 80 వేలు విలువ చేసే రైఫిల్ కూడా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తన వద్ద 12 వేల రూపాయలు విలువ చేసే ఓ మొబైల్ ఫోన్, 49 వేలు విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. అలాగే 20 వేలు విలువ చేసే ఓ రుద్రాక్ష మాల ఉందని యోగి తన అఫిడవిట్లో తెలిపారు. అయితే గత ఎన్నికల అఫిడవిట్లో రెండు కార్లు ఉన్నాయని యోగి తెలిపారు. ప్రస్తుతం కార్లు లేవని తన అఫిడవిట్లో తెలిపారు.