బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యెడియూరప్ప మనుమరాలు డాక్టర్ సౌందర్య (30) అనుమానాస్పద స్థితిలో మరణించారు. శుక్రవారం బెంగళూరులోని వసంత్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. రోజులాగే సౌందర్య భర్త డాక్టర్ నీరజ్ ఉదయం విధులకు వెళ్లారు. తర్వాత పనిమనిషి వచ్చి తలుపు ఎంతసేపుకొట్టినా సౌందర్య తెరువలేదు. దీంతో ఆ పనిమనిషి నీరజ్‌కు ఫోన్ చేశారు. వెంటనే సౌందర్య సెల్‌ఫోన్‌కు నీరజ్ ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో తలుపును బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా సౌందర్య ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించారు.