Delhi : దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, ముంబైలో చినుకు పడితే చాలు వాహనదారులు, లోతట్టు కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా ఢిల్లీ (Delhi) కూడా వరద ముప్పును ఎదుర్కొంటోంది. యమునా నది (Yamuna River) మరో రెండు రోజుల్లో ఉగ్రరూపం దాల్చనుండడమే అందుకు కారణం. అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు ఆదివారం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నిండుకుండలా మారింది. ఆదివారం ఉదయం 1.76లక్షల క్యూసెక్కుల నీరు యమునాకు చేరింది. ఇదే విధంగా వరద నీరు వస్తే.. సోమ, మంగళవారం ఉదయం 2 గంటల నాటికి నదిలో 206 మీటర్ల మేర నీరు చేరనుందని వరద నియంత్రణ విభాగం తెలిపింది.
VIDEO | Water enters residential areas in Haryana’s Faridabad as the water level in the Yamuna River rises.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/FAXoD8Ikrb
— Press Trust of India (@PTI_News) August 17, 2025
నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. రాబోయే వరదను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే లోతట్టు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది వరద నియంత్రణ విభాగం. మరోవైపు యమునాలో నీటి ఉద్ధృతి పెరగడంతో హర్యానాలోని ఫరీదాబాద్ గ్రామంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడి రోడ్లన్ని చెరువును తలపిస్తున్నాయి.