కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్‌కు కేంద్ర హోం శాఖ వై-ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించింది. ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై అధికారులపై దాడులు జరుగుతున్న క్రమంలో మనోజ్ అగర్వాల్‌కు కూడా ముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఈ మేరకు ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీలో భాగంగా ఆయనకు 12 మంది సీఐఎస్ఎస్ జవాన్లు సెక్యూరిటీగా ఉంటారు.