అయోధ్యలో జరుగాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశం రద్దు
పర్యవేక్షణ కమిటీని నియమించిన నేపథ్యంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని రెజ్లింగ్ ఫెడరేషన్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
లక్నో: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. ఆ పదవి నుంచి ఆయన తప్పుకోవాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రెజ్లింగ్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశంలో దీనిపై చర్చిస్తామని ఆయన చెప్పారు. కాగా, అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నిరసనకు దిగిన అగ్రశ్రేణి రెజ్లర్లతో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు పర్యవేక్షణ కమిటీని నియమించారు. దీంతో రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.
మరోవైపు పర్యవేక్షణ కమిటీని నియమించిన నేపథ్యంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని రెజ్లింగ్ ఫెడరేషన్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఫెడరేషన్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా కేంద్రం సస్పెండ్ చేసింది. దీంతో రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష బాధ్యతల నుంచి బ్రిజ్ భూషణ్ తాత్కాలికంగా తప్పుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఆదివారం జరుగాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశం రద్దైంది. అలాగే యూపీలోని గోండాలో ఆదివారం జరగాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ అత్యవసర సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని కూడా రద్దు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

