Adar Poonawala | రోజులో ఎనిమిది, తొమ్మిది గంటలకు మించి ఎక్కువ పని చేస్తే మెరుగైన ఉత్పాదకత సాధించలేరని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఇటీవల లారెన్స్ అండ్ టూబ్రో (L&T) చైర్మన్ చేసిన వారంలో 90 గంటల పనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారాల్లో కూడా తన ఉద్యోగులను పని చేయించలేకపోతున్నందుకు తాను చింతిస్తున్నానని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు. తాజాగా ఓ వైబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదార్ పూనావాలా మాట్లాడుతూ.. మనిషి ఎంత వరకు భరించగలుగుతాడన్నారు. ఎనిమిది, తొమ్మిది గంటలకు మంచి పని చేస్తే మెరుగైన ఉత్పాదకత సాధించేరన్నారు. కొన్ని సార్లు ఎక్కువగా పని చేయాల్సి వస్తుందన్నారు. కానీ, ప్రతిరోజూ అలా చేయడం సాధ్యం కాదన్నారు.
సోమవారం నుంచి ఆదివారం వరకు ఆఫీసుల్లోనూ పని చేయలేరని చెప్పారు. ఇది కొంచెం ఆచరణాత్మకం కాదన్నారు. తాను కరోనా సమయంలో రాత్రి 11 గంటల వరకు ఇంటికి వెళ్లేవాడనని తెలిపారు. పనిలో ఎంత సమయం వెచ్చించాలన్న విషయం మనం ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. ఎవరైనా కొత్త వ్యాపారాన్ని మొదలు పెడితే.. లక్ష్యాన్ని సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కష్టపడి పని చేసేందుకు వేరే ప్రత్నామ్నాయం లేదన్న ఆయన.. ఎంత వ్యూహాత్మకంగా, నాణ్యంగా చేస్తున్నామనేదే కీలకమైన విషయమన్నారు. ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటల పని విధానాన్ని సమర్థించారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సైతం 70 గంటలు పని చేయాలన్న విషయం తెలిసిందే.
Read Also :
Budget 2025 | ఆదాయ పన్ను తగ్గాలి.. బడ్జెట్లో మెజారిటీ ట్యాక్స్పేయర్స్ కోరేదిదే