న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(Arjun Ram Meghwal) ఇవాళ లోక్సభలో మాట్లాడారు. మహిళా బిల్లు మహిళల గౌరవాన్ని పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. వాళ్లకు సమాన అవకాశాలు వస్తాయన్నారు. మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. ఈ బిల్లులో నాలుగు ముఖ్యమైన క్లాజులు ఉన్నాయన్నారు. గతంలోనూ పాలకులు మహిళా బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేశారని, ఆ బిల్లు 2010లో రాజ్యసభలో పాసైనా, లోక్సభలో మాత్రం పెండింగ్లో ఉందన్నారు.
గత ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను సృష్టించాయని, కానీ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముందడుగు పడిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. 15 సంవత్సరాల పాటు ఈ బిల్లు అమలులో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు మూడవ వంతు రిజర్వేషన్ కల్పించారు.
#WATCH | Women’s Reservation Bill | Union Law & Justice Minister Arjun Ram Meghwal says, “…This Bill will enhance the dignity of women as well as equality of opportunities. Women will get representation. There are four important clauses…” pic.twitter.com/BDamDXOZdq
— ANI (@ANI) September 20, 2023