ముంబై: లేడీస్ స్పెషల్ ట్రైన్ ఆలస్యంగా వచ్చింది. దీంతో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు కంపార్టెమెంట్ డోర్స్ వద్ద బయటకు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు. (Women Hang Onto Moving Train) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం రద్దీ సమయంలో కల్యాణ్ లేడీస్ స్పెషల్ లోకల్ రైలు 40 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఆ రైలులో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. చాలా మంది మహిళలు ఆ రైలు ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు. కొందరు మహిళలు కంపార్టెమెంట్ డోర్స్ వద్ద ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ ప్రయాణించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో మహిళలు ప్రయాణించడం, రద్దీ వల్ల ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియోను రైల్వేకు టాగ్ చేశారు. దీంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ సమస్యపై తక్షణ చర్య కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
#ViralVideo #CRFixLocalTrainDelays Today’s Ladies Special from Kalyan was delayed by 40 mins, forcing women to hang on the footboard—an unsafe and risky commute. Railways term this dangerous, yet delays continue. @AshwiniVaishnaw pls review delay data. @MumRail @rajtoday pic.twitter.com/vnhxTIyFD6
— Mumbai Railway Users (@mumbairailusers) May 9, 2025