న్యూఢిల్లీ: జిమ్‌లో ఒక పరికరం కోసం ఇద్దరు మహిళ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక జిమ్‌లో కొందరు మహిళలు కసరత్తులు చేస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ వద్ద ఒక మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తున్నది. ఇంతలో మరో మహిళ అక్కడకు వచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ పరికరం కోసం ఎదురు చూస్తున్న మహిళను పక్కకు తోసింది. దీంతో ఆమె తిరగబడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఒకరి జుట్టును మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. అక్కడున్న మిగతా మహిళలు వారిద్దరినీ విడదీసేందుకు తెగ ప్రయత్నించారు.
కాగా, ఆ జిమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ను ఒక యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో అన్నది పేర్కోలేదు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. మహిళల ఫైటింగ్ అంతే తనకు ఎంతో ఇష్టమని, అయితే వారు జట్లు పట్టుకోవడం తప్ప మరో విధంగా కొట్టుకోరు అంటూ ఒకరు జోక్ చేశారు. ‘అందుకే నేను జిమ్‌కు వెళ్లను. ఇంట్లోనే మార్నింగ్ వాక్, వ్యాయామాలు చేస్తా’ అంటూ మరొకరు చమత్కరించారు.
Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj
— r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022