Nagarjuna | నాగార్జున 100వ సినిమాపై భారీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..!
Nagarjuna | టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తోంది. తాత్కాలికంగా ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలవనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nagarjuna | టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తోంది. తాత్కాలికంగా ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలవనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 29న ‘కింగ్ 100’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌తో పాటు సినిమా అసలు టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సినిమా విడుదల తేదీపై కూడా కీలక ప్రకటన రావచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘కింగ్ 100’ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నప్పటికీ, కథలో ప్రధానంగా తండ్రీ–కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ బంధం కీలకంగా ఉండనున్నట్లు సమాచారం. అదే సమయంలో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే వ్యక్తి ప్రయాణాన్ని చూపించే రాగ్స్ టు రిచెస్ అంశం కూడా కథలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్, కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని మిళితం చేసి దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగార్జునకు ఇది ఆయన గత చిత్రాలకు భిన్నమైన పాత్రగా నిలవనుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో నాగార్జున పలు పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం. 25 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి వరకు విభిన్న దశల్లో ఆయన పాత్ర ప్రయాణం సాగుతుందని తెలుస్తోంది. దీంతో ఒకే సినిమాలో నాగార్జునలోని విభిన్న షేడ్స్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ లుక్ నుంచి మెచ్యూర్ పాత్ర వరకు నాగార్జున ఎలా కనిపించబోతున్నారు? మేకోవర్ కోసం ఎలాంటి మార్పులు చేసుకున్నారు? అనే అంశాలు కూడా ‘కింగ్ 100’పై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రముఖ నటి టబుతో పాటు సుష్మిత భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. నాగార్జున 100వ చిత్రం కావడంతో కథ, తారాగణం, నిర్మాణ విలువల విషయంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

