H-1B VISA | హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ సమగ్ర ప్రక్షాళన.. ప్రతిపాదనను వైట్‌హౌస్‌కు పంపిన ట్రంప్ సర్కార్
H-1B VISA | అమెరికా (USA) లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు వినియోగించుకునే హెచ్-1బీ వీసా (H-1B VISA) ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు సిద్ధమవుతోంది. ఈ వీసా విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన కొత్త ప్రతిపాదనను శ్వేతసౌధం (White House) పరిశీలనకు పంపింది. ఈ పరిణామం హెచ్-1బీ వీసాదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
H-1B VISA : అమెరికా (USA) లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు వినియోగించుకునే హెచ్-1బీ వీసా (H-1B VISA) ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు సిద్ధమవుతోంది. ఈ వీసా విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన కొత్త ప్రతిపాదనను శ్వేతసౌధం (White House) పరిశీలనకు పంపింది. ఈ పరిణామం హెచ్-1బీ వీసాదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
“హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్ సంస్కరణ” పేరుతో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) ఈ ప్రతిపాదనను సోమవారం శ్వేతసౌధంలోని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్ఏ) కు సమర్పించింది. దీన్ని “ఆర్థికంగా కీలకమైనది” గా వర్గీకరించారు. అంటే ఈ మార్పుల వల్ల వార్షికంగా కనీసం 100 మిలియన్ డాలర్ల ప్రభావం ఉండొచ్చని లేదా ఆర్థికవ్యవస్థ, ఉద్యోగాలు, ఉత్పాదకత వంటి కీలక రంగాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని అర్థం. అయితే ఈ ప్రతిపాదనలోని పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
వీసా అర్హత ప్రమాణాలు, యజమానుల బాధ్యతలు, వేతన నిబంధనలు, వార్షిక ఎంపిక ప్రక్రియ వంటి అంశాల్లో ఏ మార్పులు తీసుకురానున్నారనే దానిపై స్పష్టతలేదు. శ్వేతసౌధం సమీక్ష పూర్తయిన తర్వాతే ఈ ప్రతిపాదన వివరాలు ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తారు. అనంతరం దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, వచ్చిన సూచనలు పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన సమీక్ష దశలోనే ఉన్నందున ప్రస్తుత హెచ్-1బీ నిబంధనలలో ఎలాంటి మార్పు లేదు.
కాగా, ఈ సమగ్ర ప్రక్షాళన ప్రతిపాదనకు అదనంగా ప్రభుత్వం మరికొన్ని కఠిన నిబంధనలను పరిశీలిస్తోంది. వాటిలో క్యాప్-సబ్జెక్ట్ హెచ్-1బీ పిటిషన్‌పై అదనంగా 103,265 డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదన ఒకటి, ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్చుకోవడానికి వీలు కల్పించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదన మరొకటి సమీక్షలో ఉన్నాయి. ఈ పరిణామాలు అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

