Women Congress Dharna : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళా నేతలు ధర్నాకు దిగారు. పలు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వెళ్లిన లీడర్స్.. సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెలంగాణ నుంచి మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapally Rekha), మరికొందరు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోడీ ప్రభుత్వం ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అని గొప్పగా ప్రచారం చేస్తుంది. కానీ, ఆచరణలో మాత్రం అది ఎక్కడా కనిపించడం లేదు. బీజీపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మాయిలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని దర్నాల్లో పాల్గొన్న మహిళా నేతలు వాపోయారు. భద్రత కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పలువురు చెప్పారు. ఈ సందర్భంగా ‘భాజాపా భగావో.. బేటీ బచావో’ (బీజేపీని తరిమికొట్టండి.. ఆడ బిడ్డలను కాపాడండి) అని హిందీ అక్షరాల్లో రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు రేఖ. అయితే.. రేఖ, తదితరులు ర్యాలీగా మందుకు వెళ్లకుండా పోలీసులు బలగాలు అడ్డుకోవడంతో పక్కనే ఉన్న పార్కులో ప్లకార్డులతో నిరసన తెలిపారు.