Farokh Engineer : భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు వేళ టీమిండియా దిగ్గజం ఫరూఖ్ ఇంజనీర్ (Farokh Engineer)కు అరుదైన గౌరవం లభించనుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు ఫరూక్ పేరు పెట్టాలని ల్యాంక్‌షైర్ కౌంటీ క్లబ్ నిర్ణయించింది. తమజట్టుకు పదేళ్లు ఆడిన ఆయన సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం సదరు క్లబ్ తెలిపింది. వెస్టిండీస్ లెజెండ్ క్లైవ్ లాయిడ్ పేరును కూడా ఒక స్టాండ్‌కు పెడుతామని తెలిపింది ల్యాంక్‌షైర్.
‘ఫరూఖ్, లాయిడ్ మా క్లబ్ క్రికెట్ పురోగతికి విశేషంగా కృషి చేశారు. అందుకే ఈ దిగ్గజ ఆటగాళ్ల పేర్లతో స్టాండ్స్ ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ ఇద్దరూ ఈ గౌరవానికి అన్ని విధాలా అర్హులు’ అని ల్యాంక్‌షైర్ క్లబ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. లాయిడ్ ఏకంగా రెండు దశాబ్దాలు ఈ క్లబ్ జట్టు తరఫున ఆడాడు. సో.. ఈ ఇద్దరు మాజీల పేర్లతో స్టాండ్స్‌ను ఏర్పాటు చేసి సమున్నతంగా గౌరవించింది.
Former India wicket-keeper Farokh Engineer and West Indies legend Clive Loyd are set to have stands named after them at the iconic Old Trafford ground by their former county side Lancashire on the sidelines of the fourth Test between India and England
Details ⬇️… pic.twitter.com/PYcY5DrXmR
— Sportstar (@sportstarweb) July 21, 2025
ఫరూఖ్ 1968 నుంచి 1976 వరకూ175 మ్యాచులు ఆడాడు. వికెట్ కీపర్ అయిన అతడు ల్యాంక్‌షైర్ తరఫున 42 క్యాచ్‌లు పట్టడమే కాకుండా 35 స్టంపింగ్స్ చేశాడు. అంతేకాదు ఆ జట్టు నాలుగు పర్యాయాలు జిల్లెట్ కప్ ఛాంపియన్‌గా నిలవడంలో ఫరూఖ్ కీలక పాత్ర పోషించాడు. విండీస్‌కు రెండు వన్డే వరల్డ్ కప్‌లు అందించిన లాయిడ్ కూడా ఈ క్లబ్ క్రికెట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టుకు ఒక్క రోజే ఉంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డు వేదికగా జూలై 23 నుంచి మ్యాచ్ షురూ కానుంది. తొలి టెస్టులో కంగుతిన్న టీమిండియా.. బర్మింగ్హమ్లో సూపర్ విక్టరీతో ఇంగ్లండ్‌కు షాకిచింది. సిరీస్ సమం చేసిన ఉత్సాహంతో లార్డ్స్‌కు వెళ్లిన గిల్ సేన అనూహ్యంగా ఓడిపోయింది. తొలి మూడు రోజులు ఆధిపత్యం చెలాయించి రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. బుమ్రా ఐదు వికెట్లతో రాణించినా.. జడేజా అద్భుతంగా పోరాడినా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక మ్యాచ్‌ను అప్పగించింది. దాంతో, ఐదు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.