Honeymoon murder | సోనమ్ రఘువంశీని చూసేందుకు జైలుకురాని కుటుంబసభ్యులు
Honeymoon murder | మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీని పరామర్శించేందుకు ఆమె కుటుంబ సభ్యులెవరూ జైలుకు రాలేదు. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ గత నెల రోజులుగా షిల్లాంగ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ జైలుకు రాకపోవడం గమనార్హం.
Honeymoon murder : మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీని పరామర్శించేందుకు ఆమె కుటుంబ సభ్యులెవరూ జైలుకు రాలేదు. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ గత నెల రోజులుగా షిల్లాంగ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ జైలుకు రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా, ఆమె తన నేరానికి పశ్చాత్తాపపడటంలేదని జైలు అధికారులు పేర్కొంటున్నారు.
షిల్లాంగ్ జైలులోని వార్డెన్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గదిలో సోనమ్‌ను ఉంచారు. ఆమెతో పాటు మరో ఇద్దరు అండర్ ట్రయల్ మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. జైల్లో నిబంధనల ప్రకారం, ఆమెకు ఇంకా ఎలాంటి పని అప్పగించలేదని, నిరంతరం సీసీటీవీ కెమెరాల ద్వారా ఆమె కదలికలను పర్యవేక్షిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. సోనమ్ జైలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నదని, తోటి ఖైదీలతో తన వ్యక్తిగత విషయాలు కానీ, కేసు వివరాలు కానీ పంచుకోవడంలేదని అధికారులు వెల్లడించారు.
సోనమ్‌కు ములాఖత్ అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని, కనీసం ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడలేదని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీలు ఈ ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న హనీమూన్ కోసం దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరు కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని ఓ జలపాతంలో గుర్తించారు.
సోనమ్ కోసం పోలీసులు గాలించగా జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఆమె ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

