UP | బుదాన్ (యూపీ), డిసెంబర్ 12: ఉత్తరప్రదేశ్‌లో అవయవాల అక్రమ దందా జరుగుతున్నట్టు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట బుదౌన్ జిల్లాలో వరకట్నం హత్య జరిగింది. ఓ యువతిని చంపి ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
పరిశీలించిన కుటుంబసభ్యులు మృతదేహానికి కండ్లు లేవని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం సందర్భంగా కండ్లను తీసి అవయవాల అక్రమ దందా నిర్వహిస్తున్నారని ప్రభుత్వ వైద్యులపై ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.