లండన్ : ఇష్టమైన ఉద్యోగం చేస్తే ఎంత పనిచేసినా అలసట రాదంటారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ ఇంగ్లీష్ టీచర్‌గా తనకు వస్తున్న మంచి జీతాన్ని సైతం వదులుకుని ఇటలీలో పూర్తికాల ప్రొఫెషనల్ జలకన్యగా మారిపోయింది. తనకిష్టమైన పనినే తాను చేస్తున్నానని జలకన్యగా మారిన మాస్ గ్రీన్ బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. కెరీర్ మార్పు పట్ల తాను కలత చెందడం లేదని ఎంతో హ్యాపీగా ఉన్నానని మురిసిపోయింది. టార్కే, దెవాన్కు చెందిన మాస్ (33) ఇంగ్లీష్ బోధించేందుకు 2016లో సిసిలీకి వచ్చింది.
మేజికల్ మత్స్యకారుడి డ్రెస్‌లో ఓ బీచ్ నుంచి వ్యక్తి బయటకు రావడం చూసిన తర్వాత తనకు జలకన్యగా మారాలనే ఆలోచన వచ్చిందని మాస్ తెలిపింది. తాను కోరుకుంటున్న న్యూ హాబీ ఇదేనని తనకు అనిపించిందని గుర్తుచేసుకుంది. ఇది చాలా భిన్నమైనదని, దీన్ని తాను ఒంటరిగా చేస్తుంటానని తెలిపింది. తోక లాంటి డ్రెస్ ధరించి జలకన్యగా స్విమ్మింగ్ చేయడం ఆస్వాదిస్తానని, ప్రకృతి, సముద్రంతో మరింత సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.
తాను హాబీగా సముద్రంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఇన్స్టాగ్రాం ద్వారా ప్రొఫెషనల్ జలకన్య జాబ్ ఆఫర్ లభించిందని తెలిపింది. జలకన్యగా నీటిలోపల ఎలా ఉండాలి, శ్వాస తీసుకోవడం వంటి పలు ట్రిక్స్పై మాస్ శిక్షణ తీసుకుంది. మత్స్యకన్యగా తాను జీవితాంతం కొనసాగుతానని, కెరీర్ మార్పు ఉండదని, జలకన్యగా లభించే స్వేచ్ఛను అనుభవిస్తానని తెలిపింది. జలకన్యగా ఆమె ఎక్కువ సంపాదించలేకున్నా తాను బతికేందుకు ఇది సరిపోతుందని ఆమె సర్ధిచెప్పుకుంటోంది. తనకు ఇష్టమైన పనిచేస్తున్నానా లేదా అనేదే ముఖ్యమని అంటోంది.
Read More :