జైపూర్: రాజస్థాన్‌లోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళ గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఈ ఘటన ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఆ కేసుతో లింకున్న ప్రైవేటు కంపెనీ సీఈవోతో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు కంపెనీలో సీఈవోగా చేస్తున్న జితేశ్ సిసోడియా.. వారం క్రితం బర్త్‌డే పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి మహిళా మేనేజర్ కూడా హాజరైంది. ఈ కేసులో మరో మహిళా ఎగ్జిక్యూటివ్, ఆమె భర్త గౌరవ్ సిరోహి నిందితులుగా ఉన్నారు. గురువారం ముగ్గుర్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.
బీఎన్ఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద సుఖీర్ పోలీసు స్టేషన్లో కేసు బుక్ చేశారు. నిందితుల్ని రిమాండ్‌కు పంపినట్లు ఉదయ్‌పూర్ ఎస్పీ యోగేశ్ గోయల్ తెలిపారు. బర్త్‌డే పార్టీ ముగిసిన తర్వాత అతిథులు అందరూ వెళ్లిపోయారని, అయితే మహిళా ఎగ్జిక్యూటివ్ .. లేడీ మేనేజర్‌ను ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పింది. కారులో బాధిత మేనేజర్‌తో పాటు సిసోడియా,సిరోహి ఉన్నారు. దారిలో ఓ చోట ఆగి సిగరెట్లు కొన్నారని, ఆ సిగరేట్ తాగిన తర్వాత స్పృహ కోల్పోయినట్లు మేనేజర్ చెప్పింది. మరుసటి రోజు మళ్లీ నిద్ర లేచినట్లు పేర్కొన్నది. అయితే తనపై లైంగిక దాడి జరిగినట్లు అప్పుడు గుర్తించినట్లు ఆమె తెలిపింది.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేశారు. నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. లేడీ మేనేజర్‌పై మెడికల్ పరీక్షలు చేయించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఏఎస్పీ మాధురీ వర్మకు దర్యాప్తు వివరాలు అందజేసినట్లు తెలుస్తోంది.