చిన్న విషయంలో గొడవ.. భాగస్వామిని కత్తితో పొడిచేసిన యువతి!
ఆన్లైన్లో పరిచయమైన ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఆ యువతి సరేనంది. సదరు యువకుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఎవరెవరికో కాల్స్ చేస్తూ.. ఎక్కువ సమయం అలాగే గడిపేస్తోంది. ఈ విషయంలో ఇద్దరికీ పలుమార్లు వాగ్వాదాలు జరిగాయి. తాజాగా ఇదే విషయంలో గొడవ జరగ్గా.. సదరు యువతి వంటింట్లో కత్తి తీసుకొచ్చి ఆ యువకుడిని పొడిచి పారేసింది.
ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. మహేష్ (25) అనే యువకుడు ఫుడె డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రెండున్నరేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రాంలో అశ్విత (22)తో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. ఈ క్రమంలో కుటుంబాన్ని వదిలేసి మహేష్‌తో కలిసి ఉండేందుకు వచ్చేసింది అశ్విత. ఈ విషయాన్ని కుటుంబానికి కూడా చెప్పిన మహేష్.. తన ప్రేయసితో కలిసి జీవించడం మొదలు పెట్టాడు.
ఆ తర్వాత కొంత కాలానికే అశ్విత మరీ ఎక్కవ సమయం కాల్స్‌లో గడిపేయడం మొదలు పెట్టింది. దీని గురించి మహేష్ ఎప్పుడు అడిగినా.. ఆమె గొడవ పడేది. శనివారం నాడు కూడా ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటం మహేష్ చూశాడు. దాంతో కోపంగా ఆమెను నిలదీశాడు.
దీంతో మరింత రెచ్చిపోయిన అశ్విత.. వంట గదిలోని కత్తి తీసుకొచ్చి మహేష్ ఛాతీ, మెడపై పొడిచేసింది. భయంతో పారిపోయిన మహేష్.. పక్కింట్లో తలదాచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అశ్వితను అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి రెండో పెళ్లి చేసుకుందని, తనకు ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదని అశ్విత అంటోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

