జైపూర్: మహిళకు ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను ఆమె హత్య చేసింది. మృతదేహాన్ని బైక్‌పై తరలించి ఒక చోట తగులబెట్టారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ధన్నాలాల్ సైనీ కూరగాయల వ్యాపారి. అతడి భార్య గోపాలీ దేవికి బట్టల షాపులో పని చేసే దీన్‌దయాళ్‌తో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఇటీవల ఆమె భర్తకు తెలిసింది.
కాగా, మార్చి 15న ఇంట్లో భార్య గోపాలీ దేవి కనిపించకపోవడంతో భర్త ఆగ్రహించాడు. దీన్‌దయాళ్ పని చేసే బట్టల షాపు వద్దకు అతడు వెళ్లాడు. అక్కడ అతడితో కలిసి భార్య ఉండటం చూసి మండిపడ్డాడు. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తమ మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసిన అతడ్ని హత్య చేయాలని వారిద్దరూ నిర్ణయించారు.
మరోవైపు మాయమాటలు చెప్పి షాపు పైఅంతస్తులో ఉన్న మరో షాపులోకి ధన్నాలాల్ను వారు తీసుకెళ్లారు. అక్కడ ఐరన్ రాడ్‌తో అతడి తలపై కొట్టారు. తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. పెద్ద సంచిలో మృతదేహాన్ని ఉంచారు. బైక్‌పై నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తగులబెట్టి ఆధారం లేకుండా చేసేందుకు ప్రయత్నించారు.
ధన్నాలాల్ హత్య తర్వాత జైపూర్ నుంచి పారిపోవాలని దీన్‌దయాళ్, గోపాలీ దేవి ప్లాన్ వేశారు. అయితే ఈ హత్య విషయం తెలిసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. భర్తను హత్య చేసిన భార్య గోపాలీ దేవి, ఆమె ప్రియుడు దీన్‌దయాళ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ జంట బైక్‌పై ధన్నాలాల్ మృతదేహాన్ని తరలిస్తున్న సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Just another honda shern!#Jaipur, Rajasthan: Gopali Devi (42) along with boyfriend Deendayal strangled her husband Dhannalal to death, later packed his body in a sack, went to forest on a bike and burnt it in Jaipur’s Muhana on March 16.
Dhannalal’s half burnt body was found… pic.twitter.com/TfxvCREFML
— Saba Khan (@ItsKhan_Saba) March 20, 2025