బెంగళూరు, నవంబర్ 19: బెంగళూరు విద్యుత్తు పంపిణీ అధికారుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా కిందపడివున్న కరెంట్ తీగలు తగిలి తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మృత్యువాత పడ్డారు. వైట్‌ఫీల్డ్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సౌందర్య తన బిడ్డను వెంటబెట్టుకొని తల్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నగరంలోని పలుచోట్ల ఫుట్‌పాత్‌పై ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ పడినున్నాయని, కరెంట్ తీగలు తెగిపడ్డా.. వాటిని కూడా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనుకోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఓ పోలీస్ అధికారి చెప్పారు. ‘బెస్కమ్’ (బెంగళూరు విద్యుత్ పంపిణీ కంపెనీ) అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.