ముంబై, జూలై 16: కదులుతున్న ఓ బస్సులో ప్రసవించిన 19 ఏండ్ల ఓ గర్భిణి, అప్పుడే పుట్టిన తన బిడ్డను నిర్దాక్షిణ్యంగా కిటికీ నుంచి బయటకు విసిరేసింది. దీంతో ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట్ర పర్భణీలో ఓ స్లీపర్‌కోచ్ బస్సులో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
బిడ్డను విసిరేసి.. ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన తల్లి, ఆమె భర్తగా భావిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి పాత్రి పోలీస్ స్టేషన్లో వారిద్దరిపై కేసు నమోదుచేశారు. ప్రసవం తర్వాత రితికా, అల్తాఫ్ షేక్‌లు.. నవజాత శిశువును ఓ బట్టలో చుట్టి కదులుతున్న బస్సు కిటికీలో నుంచి బయటకు విసిరేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.