లక్నో: స్నేహితుడి ఇంట్లో మహిళ మృతదేహం కనిపించింది. ఫ్రెండ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడని మహిళ కుటుంబం ఆరోపించింది. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పినట్లు పోలీసులు నిర్ధారించారు. (Woman Found Dead At Friend’s House ) పరారీలో ఉన్న స్నేహితుడి కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మహానగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో 28 ఏళ్ల పవన్ నివసిస్తున్నాడు. ఏప్రిల్ 30న స్నేహితురాలైన 24 ఏళ్ల మహిళ అతడి ఇంట్లో మరణించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఆ మహిళపై పవన్ అత్యాచారానికి పాల్పడి, గొంతు నొక్కి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న పవన్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.