Delivery Rider : కష్టపడి చేసే ఏ పనైనా గొప్పదే. సొంతకాళ్ల మీద నిలబడటంకన్నా గౌరవం ఏముంటుంది..! కానీ, కొందరు కొన్ని పనుల్ని తప్పుగా భావిస్తారు. అలాంటి పనులు చేసే వారిని అవమానిస్తుంటారు. తాజాగా ఒక యువతి కష్టపడి పనిచేస్తున్న తన చిన్ననాటి స్నేహితుడిని ఇలాగే అవమానించింది. పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న స్కూల్ డేస్ స్నేహితుడిని వీడియో తీసి, ఆ వీడియోలోనే అతడిని అవమానించింది.
అంతేకాదు.. తన ఫ్రెండ్స్‌కు ఆ వీడియో పంపించింది. మెల్లిగా ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ వీడియో తీసిన యువతిపై మండిపడుతున్నారు. ఇదంతా బిహార్‌లోని పాట్నాలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియో ప్రకారం.. ఒక యువకుడు బైకుపై పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్తున్నాడు. అతడు రోడ్డుపై డెలివరీ బైక్ రైడ్ చేస్తూ వెళ్తుండగా చూసిన తన స్కూల్ డేస్ స్నేహితురాలు అతడిని బైకుపై ఉండగానే వీడియో తీసింది. చిన్నప్పుడు తను అందరినీ ఇన్స్పైర్ చేసేవాడని, ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడని కామెంట్ చేసింది. అంతేకాదు.. ఆ వీడియోను తమ ఫ్రెండ్స్ అందరికీ పంపుతానని అతడిని బెదిరించింది. ఈ వీడియోలో ఆ యువతి అతడిని నవ్వుతూ, వెక్కిరిస్తూ ఉంటుంది. అతడు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. అయినా, అతడు నవ్వుతూనే ఆమెకు బదులిచ్చాడు. ఏదైతేనే ఆ వీడియో తీసి, ఇప్పుడు వైరల్ చేసింది.
A pizza delivery boy met his school-time female friend on the road…
She started recording and mocked him: “You used to motivate everyone in school… and now you’re delivering pizza?”Then she said she’ll send the video to other friends too.
She laughed… but didn’t think for a… pic.twitter.com/hkSzH04O6x
— Saffron Chargers (@SaffronChargers) January 29, 2026
ఈ వీడియోపై ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు. కష్టపడి పని చేసుకుంటున్న అతడిని అవమానించడం ఏంటని యువతిపై మండిపడుతున్నారు. పిజ్జా డెలివరీ చేయడం సిగ్గు పడాల్సిన పని కాదని.. ఇతరుల్ని అవమానించినందుకు సిగ్గుపడాలని ఆ యువతికి సూచిస్తున్నారు. లైఫ్‌లో ఎన్నో డ్రీమ్స్ ఉన్నప్పటికీ.. కుటుంబ పోషణ కోసం కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని, డ్రీమ్స్‌కు, రియాలిటీకి తేడా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇలా ఒకరిని కించపరిచేలా అవమానించడం సరికాదంటున్నారు.