Woman Drowns Children | నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకిన తల్లి.. బతికిన మహిళ, పిల్లలు మృతి
Woman Drowns Children | ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. ఆ మహిళను స్థానికులు కాపాడారు. దీంతో ఆమె బతకగా నలుగురు పిల్లలు మరణించారు. చిన్నారుల మృతదేహాలను బావి నుంచి పోలీసులు వెలికితీశారు.
భోపాల్: ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. (Woman Drowns Children) ఆ మహిళను స్థానికులు కాపాడారు. దీంతో ఆమె బతకగా నలుగురు పిల్లలు మరణించారు. చిన్నారుల మృతదేహాలను బావి నుంచి పోలీసులు వెలికితీశారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపాల్ఖేడా గ్రామానికి చెందిన 40 ఏళ్ల సుగ్నా బాయి, ఆమె భర్త రోడు సింగ్ మధ్య శనివారం సాయంత్రం గొడవ జరిగింది. దీంతో భార్త కొట్టడంతో సుగ్నా తన నలుగురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సమీపంలోని స్కూల్లో ఆ రాత్రి గడిపింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ఒక బావి వద్దకు చేరుకుంది. ఆత్మహత్య చేసుకునేందుకు నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది.
కాగా, గమనించిన స్థానికులు సుగ్నా బాయిని సకాలంలో కాపాడారు. బావి నుంచి ఆమెను బయటకు తీశారు. అయితే ఆమె పిల్లలను కాపాడలేకపోయారు. దీంతో 11 ఏళ్ల అరవింద్, 9 ఏళ్ల అనూష, 6 ఏళ్ల బిట్టు, 3 ఏళ్ల కార్తీక్ బావి నీటిలో మునిగి మరణించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను బావి నుంచి వెలికి తీయించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Children
- drowns
- Madhya Pradesh
- well
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

