Viral Video | బ్యాక్‌ప్యాక్‌లో పెంపుడు పిల్లితో స్కూటర్‌పై ప్రయాణించిన మహిళ
కుక్కలు, పిల్లులు, పక్షులు ఇలా పెంపుడు జంతువులు (Viral Video)మన జీవితాల్లో పెనవేసుకుపోయాయి. అవి మన స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల్లా మనలో కలిసిపోయాయి.
బెంగళూర్ : కుక్కలు, పిల్లులు, పక్షులు ఇలా పెంపుడు జంతువులు (Viral Video)మన జీవితాల్లో పెనవేసుకుపోయాయి. అవి మన స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల్లా మనలో కలిసిపోయాయి. అయితే నేటి ఆధునిక జీవనశైలి, రోజువారీ పనుల ఒత్తిళ్లలో వాటి ఆలనాపాలనా చూసే తీరిక ఎవరికీ ఉండటం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఓ మహిళ వినూత్న ఆలోచనను ఆచరణలో పెట్టింది.
బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ స్కూటర్‌పై బ్యాక్‌ప్యాక్‌లో పెంపుడు పిల్లిని వెంటతీసుకుని కార్యాలయానికి వెళుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళ బ్యాక్‌ప్యాక్‌లో కూర్చున్న పిల్లి ఎంతో చురుకుగా కనిపించింది. ఈ వీడియోను తొలుత సోషల్ మీడియా యూజర్ అనిర్బన్ రాయ్ దాస్ ట్విట్టర్లో షేర్ చేశారు.
Best way to go to work is to carry your furry friends with you.
Found this cute, so recorded it to show it to my other friends with pets.
I know this is not a new way, but I just happen to see it today.
Beating @peakbengaluru traffic with pawed company. pic.twitter.com/xsqVNVQhmS
— Anirban Roy Das (@anirbanroydas) August 3, 2023
మీ స్నేహితులను మీ వెంట తీసుకుని వెళ్లడం పని ప్రదేశానికి చేరుకునే సరైన విధానం..ఈ క్యూట్ ఐడియా తన కంటపడగానే స్నేహితులతో పంచుకోవాలనిపించిందని, ఇది తన దృష్టిని ఆకర్షించిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. పెంపుడు జంతువులతో తమకున్న అనుబంధాన్ని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
X accounts blocked | నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎక్స్ (ట్విటర్) కఠిన చర్యలు.. రెండు నెలల్లో 24 లక్షల ఖాతాలు బ్లాక్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Pet Cat
- scooter
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

