X accounts blocked | నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎక్స్ (ట్విటర్) కఠిన చర్యలు.. రెండు నెలల్లో 24 లక్షల ఖాతాలు బ్లాక్
X accounts blocked | నిబంధనలను ఉల్లంఘించిన వినియోగదారులపై ఎక్స్ (ట్విటర్) కఠిన చర్యలు తీసుకుంటోంది. గత జూన్, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 మంది ఖాతాలను బ్లాక్ చేసినట్లు తాజాగా వెల్లడించింది.
న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘించిన వినియోగదారులపై ఎక్స్ (ట్విటర్) కఠిన చర్యలు తీసుకుంటోంది. గత జూన్, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 మంది ఖాతాలను బ్లాక్ చేసినట్లు తాజాగా వెల్లడించింది. బ్లాక్ చేసిన వాటిలో చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించినవి, అశ్లీలతను ప్రోత్సహించే ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు కూడా మే 26 నుంచి జూన్ 25 మధ్య నెల రోజుల వ్యవధిలో 5,44,473 హ్యాండిళ్లను ఎక్స్ బ్లాక్ చేసింది.
తాము ఇప్పటివరకు బ్లాక్ చేసిన ఖాతాల్లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నవి 1,772 ఉన్నాయని వెల్లడించింది. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా ఎక్స్ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వినియోగదారులపై తీసుకున్న చర్యలు, వినియోగదారుల ఫిర్యాదులకు తాము చూపించిన పరిష్కారాలను వివరిస్తూ ఎక్స్ ప్రతి నెలా నివేదికలను విడుదల చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

