Watch: ప్రమాదంపై వ్యక్తితో గొడవ.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన మహిళ
డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రియాంక కారు నుంచి కిందకు దిగలేదు. పైగా దర్శన్‌ను కారుతో ఢీకొట్టి డ్రైవ్ చేసింది. దీంతో అతడు ప్రియాంక కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు.
బెంగళూరు: ఒక వ్యక్తితో గొడవ పడిన మహిళ ఆగ్రహంతో అతడ్ని కారు బానెట్‌పై ప్రమాదకరంగా కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ప్రియాంక నడుపుతున్న టాటా నిక్సన్ కారు, దర్శన్ డ్రైవ్ చేస్తున్న స్విఫ్ట్ కారు శుక్రవారం ఢీకొన్నాయి. జ్ఞాన భారతి నగర్ ప్రాంతంలోని ఉల్లాల్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా ప్రియాంక, దర్శన్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కారు నుంచి దిగిన దర్శన్, ప్రియాంక కారు వద్దకు వచ్చాడు.
కాగా, డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రియాంక కారు నుంచి కిందకు దిగలేదు. పైగా దర్శన్‌ను కారుతో ఢీకొట్టి వేగంగా డ్రైవ్ చేసింది. దీంతో అతడు ప్రియాంక కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు. రక్షించాలంటూ అరిచాడు. అయినా కారును ఆపకుండా కిలోమీటరు దూరం వరకు బానెట్‌పై అతడ్ని ఈడ్చుకెళ్లింది.
మరోవైపు, రద్దీ రహదారిపై వాహనాల్లో వెళ్లే వారు దీనిని చూశారు. కొందరు వ్యక్తులు బైక్‌ల్లో ఆ కారును అనుసరించి చివరకు దానిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ ఫిర్యాదుతో ప్రియాంకపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆమె ఫిర్యాదుతో దర్శన్‌తోపాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Bengaluru police has registered 307 case in a case of negligent and rash driving against a lady named Priyanka. She had dragged Darshan for almost a km who was hanging on to the bonnet of her car. They had an altercation over overtaking car. Case also against 4 others.#Karnataka pic.twitter.com/OQW5gukjgK
— Imran Khan (@KeypadGuerilla) January 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

