ముంబై, డిసెంబర్ 19: నియోజకవర్గానికి నీటి సౌకర్యం కల్పించేంతవరకు తాను క్షవరం చేయించుకోనని ప్రతిజ్ఞ చేసిన ఓ ఎమ్మెల్యే ఎట్టకేలకు నాలుగేండ్లకు తన మాటను నిలబెట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఘట్కోపర్ వెస్ట్ ఎమ్మెల్యే రామ్ కదమ్ స్థానికంగా నెలకొన్న నీటి సమస్య తీర్చేవరకు తాను జుట్టు కత్తిరించుకోనని ప్రజల ముందు గతంలో ప్రతిజ్ఞ చేశారు.
నీటి సౌకర్యం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అవి ఆమోదం పొందేలా కృషి చేశారు. దీంతో ఇటీవల భండూప్ ప్రాంతం నుంచి ఆయన నియోజక వర్గానికి మంచి నీటి పైప్‌లైన్‌ను అనుసంధానించారు. దీంతో ఘట్కోపర్ ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్య తొలగిపోయింది. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల క్షవరం చేయించుకున్నారు.