ముంబై: ఒక మహిళ చీర ఆటో బంపర్‌లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ఆటో ఆమెను 400 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది (Woman dragged by Auto). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజారాంపురి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు ఆటో ఎక్కేందుకు రోడ్డు వద్దకు వచ్చారు. మహిళ భర్త ఒక ఆటో డ్రైవర్‌తో రేటు విషయంపై మాట్లాడాడు. రేటు కుదరకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళ కూడా ఈ వాగ్వాదంలో జోక్యం చేసుకుంది.
కాగా, డ్రైవర్ ఉన్నట్టుండి వేగంగా ఆటో నడిపాడు. అయితే మహిళ చీర ఆటో బంపర్‌లో చిక్కుకుంది. దీంతో ఆమె రోడ్డుపై పడగా ఆ ఆటో ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కేకలు వేస్తూ ఆటోను వెంబడించారు. ఆటోను నిలుపాలని అరిచారు. అయితే అప్పటికే ఆ మహిళను ఆటో సుమారు 400 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. గాయపడిన ఆ మహిళను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Maharashtra – Auto driver hits & drags woman for 200 meters after a fight in #Kolhapur. pic.twitter.com/5sybtzdXl8
— TIMES NOW (@TimesNow) July 7, 2023