గోరఖ్‌పూర్: వరకట్న వేధింపులకు ఓ మహిళ బలైంది. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఆమె సూసైడ్ చేసుకున్నది. ఫోన్లో భర్త త్రిపుల్ తలాక్(triple talaq) చెప్పడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో పోలీసు శాఖకు చెందిన ఎస్సైని సస్పెండ్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే.. సానియా అనే మహిళ సోమవారం రాత్రి సూసైడ్ చేసుకున్నది. భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆమె ఆ అఘాయిత్యానికి పాల్పడింది.
ఏప్రిల్ 26వ తేదీన మహారాష్ట్ర నుంచి గోరఖ్‌పూర్ చేరుకుందామె. వరకట్న వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ కేసులో సబ్ ఇన్స్పెక్టర్ జయ ప్రకాశ్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు సీనియర్ ఎస్సీ గౌరవ్ గోవర్ తెలిపారు. సానియా తల్లి ఆసియా .. స్థానిక చౌరీ చౌరా పోలీసు స్టేషన్లో వరకట్న వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. కానీ ఆ ఫిర్యాదును ఎస్సై తోసిపుచ్చాడు. కేసు రిజిస్టర్ చేసేందుకు నిరాకరించాడు. కేసు నమోదు చేయకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు.
సానియా భర్త సలావుద్దిన్పై కేసుబుక్ చేశారు. సోమవారం సాయంత్రం ఫోన్లో అతను ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.2023, ఆగస్టు 7వ తేదీన సలావుద్దిన్ను సానియా పెళ్లి చేసుకున్నది. ఫ్యామిలీ డిమాండ్ ప్రకారం వరకట్నం ఇచ్చారు. సానియా భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వేధింపులు కొనసాగాయి. మనోవేదనకు గురైన సానియా స్వంత ఇంటికి వెళ్లింది. అయితే ఫోన్లో భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నది.