Mahakaleshwar Temple | మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల ఉజ్జయిని (Ujjain) మహాకాలేశ్వర దేవాలయంలో (Mahakaleshwar Temple) విషాదం చోటు చేసుకుంది. ఆలయంలోని ఫుడ్ సెంటర్ (Food Centre)లో గల యంత్రంలో దుపట్టా చిక్కుకుని మహిళ మృతి చెందింది. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
రజనీ ఖత్రీ (Rajni Khatri) అనే 30 ఏళ్ల మహిళ శనివారం ఉదయం ఆలయంలోని అన్న క్షేత్రంలోగల వంటగదిలో పనిచేస్తోంది. ఆ సమయంలో ఆమె మెడకు ఉన్న దుపట్టా బంగాళాదుంపలు కట్ చేసే యంత్రంలో (potato-peeling machine) చిక్కుకుపోయింది. అనంతరం దుపట్టా ఆమె మెడకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. గమనించిన సిబ్బంది రజనీ ఖత్రీని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నివేదిక తర్వాత ఆమె మృతికి గల కచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.
Also Read..
America | అమెరికాకు తప్పిన షట్డౌన్ గండం..! కీలక బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
Kavach | దట్టమైన పొగమంచులోనూ.. కవచ్ పనితీరు ఇలా.. VIDEO
Earthquake | ప్రకాశం జిల్లాలో భూకంపం.. పాఠశాల నుంచి పరుగులు తీసిన విద్యార్థులు