America | అమెరికాకు తప్పిన షట్‌డౌన్ గండం..! కీలక బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
America | షట్‌డౌన్ (Shutdown) గండం నుంచి అగ్రరాజ్యం అమెరికా (America) బయటపడింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రతినిధుల సభ (US Congress) చివరి క్షణంలో ఆమోదం తెలిపింది.
America | షట్‌డౌన్ (Shutdown) గండం నుంచి అగ్రరాజ్యం అమెరికా (America) బయటపడింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రతినిధుల సభ (US Congress) చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థిక ప్రతిష్ఠంభన నెలకొనేది. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనెట్‌కు పంపగా అక్కడ కూడా ఆమోదం లభించింది. ఈ కీలక బిల్లుకు ఆమోదం లభించడంతో అమెరికా షట్‌డౌట్ గండం నుంచి తప్పించుకున్నట్లైంది.
బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో మార్చి 14 వరకు ప్రభుత్వానికి నిధులను సమకూర్చేలా (government funding) ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేండ్లపాటు సస్పెండ్ చేయడం సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కొత్త బిల్లుకు ట్రంప్ మద్దతు తెలపడంతోపాటు దానికి అనుకూలంగా ఓటేయాలని రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. కానీ, ఈ బిల్లును డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడంతో ఆ బిల్లు 235-174 తేడాతో తిరస్కరణకు గురైంది. ఈ బిల్లును వ్యతిరేకించిన డెమోక్రాట్లకు ఏకంగా 38 మంది రిపబ్లికన్లు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. సెనేట్‌లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండటంతో ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో పార్లమెంట్ విఫలమైతే అమెరికాలో మరోసారి షట్‌డౌన్ తప్పదని, ఇది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది. ట్రంప్ డిమాండ్లను ఈ బిల్లు నుంచి తొలగించి కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టగా.. దానికి ఆమోదం లభించింది. మెజార్టీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఈ బిల్లుకు 366-34తో ఆమోదం లభించినట్లైంది. అనంతరం దీన్ని సెనెట్‌కు పంపగా.. అక్కడా ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు పంపారు. ఆయన సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది.
గతంలో ట్రంప్ హయాంలో 35 రోజులపాటు అమెరికాలో షట్‌డౌన్ కొనసాగిన విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్డౌన్గా చెప్పుకుంటారు. షట్‌డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు నిలిచిపోతాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు 8.75 లక్షల మంది ఉద్యోగుల సేవలు ఆగిపోతాయి.
Also Read..
America | షట్‌డౌన్ దిశగా అమెరికా.. కీలక బిల్లును తిరస్కరించిన ప్రతినిధుల సభ
Indians | 1,500 మంది భారతీయులు అమెరికా నుంచి తరలింపు
Justin Trudeau | ట్రుడోకు పదవీ గండం.. ప్రభుత్వాన్ని పడగొడతామన్న జగ్మిత్ సింగ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

