Justin Trudeau | ట్రుడోకు పదవీ గండం.. ప్రభుత్వాన్ని పడగొడతామన్న జగ్మిత్ సింగ్
ఇంటా.. బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు (Justin Trudeau) పదవీగండం పొంచిఉన్నది. ఇప్పటికే ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేసి ట్రుడోకు షాకివ్వగా.. తాజాగా మిత్రపక్షమైన న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) నుంచి గట్టి దెబ్బే తగిలేట్లుంది.
టొరంటో: ఇంటా.. బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు (Justin Trudeau) పదవీగండం పొంచిఉన్నది. ఇప్పటికే ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేసి ట్రుడోకు షాకివ్వగా.. తాజాగా మిత్రపక్షమైన న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) నుంచి గట్టి దెబ్బే తగిలేట్లుంది. ట్రుడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నది. శీతాకాల విరామం ముగిసిన వెంటనే హౌస్ ఆఫ్ కామన్స్‌లో జనవరి 27న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఖలిస్థానీ మద్దతుదారు, ఎన్డీపీ నేత జగ్మిత్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినట్లయితే 9 ఏండ్ల ట్రుడో పాలనకు ఎండ్ కార్డ్ పడ్డట్లే.
లిబర్ పార్టీ నాయకుడు ఎవరనేది తమకు ప్రదానం కాదని, ఈ ప్రభుత్వానికి గడువు ముగిసిందని జగ్మిత్ సింగ్ చెప్పారు. తదుపరి సమావేశాల్లో హౌస్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామని వెల్లడించారు. ప్రధాని పదవిని సమర్థవంతంగా నిర్వహించడంలో ట్రుడో విఫలమయ్యారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్డీపీ ఓటు వేస్తుందని, తమ కోసం పనిచేసే కొత్త సర్కారును ఎన్నుకోవడానికి కెనడా ప్రజలకు అవకాశం ఇస్తామని తెలిపారు. శీతాకాల విరామం ముగిసిన వెంటనే హౌస్ ఆఫ్ కామన్స్‌లో జనవరి 27న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు.
ట్రూడో తన పదవికి రాజీనామా చేయాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేశారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఇండ్లు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం, ట్రంప్ భారీ టారీఫ్ లు విధిస్తామని హెచ్చరించడంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జగ్మీత్‌కు తోడు ఆ దేశంలోని మెజార్టీ ప్రజల నుంచి ప్రధాని పదవి నుంచి ట్రుడో వైదొలగాలన్న డిమాండ్ రోజురోజుకు అధికమవుతున్నది.
కాగా, జగ్మీత్ సింగ్ ఖలిస్థానీ వేర్పాటు వాదానికి బలమైన మద్దతుదారు. వచ్చే ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే భారత్‌పై ట్రుడో అసత్యాలు ప్రచారం చేస్తూ విభేదాలను పెద్దవి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ట్రూడోపై గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో ప్రభుత్వం కూలిపోకుండా ఎన్డీపీ మద్దతు ఇచ్చింది. దీంతో అవిశ్వాస గండం నుంచి ట్రూడో గట్టెక్కగలిగాడు. ఇప్పుడు ట్రుడో ప్రభుత్వంపై నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడతామని జగ్మీత్ సింగ్ ప్రకటించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

