Indians | 1,500 మంది భారతీయులు అమెరికా నుంచి తరలింపు
Indians | లక్షలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేస్తామని దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్ ప్రకటించగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.70 లక్షల మందికిపైగా అక్రమ వలసదారులను భారత్‌తోసహా 192 దేశాలకు పంపించివేసినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు.
- హిట్‌లిస్టులో మరో 18 వేల మంది భారతీయులు
Indians | వాషింగ్టన్: లక్షలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేస్తామని దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్ ప్రకటించగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.70 లక్షల మందికిపైగా అక్రమ వలసదారులను భారత్‌తోసహా 192 దేశాలకు పంపించివేసినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఐసీఈ 2,647 మంది భారతీయులను తరలింపు నిమిత్తం నిర్బంధించింది. వీరిలో 1,500 మందిని భారత్‌కు తరలించి వేసింది. మెక్సికో, హోండురాస్, గ్వాటెమాలా తర్వాత నాలుగవ స్థానంలో భారత్ అక్రమ వలసదారుల సంఖ్య నిలుస్తుంది. బైడెన్ పాలనలో చివరి వార్షిక నివేదిక ప్రకారం ట్రంప్ గతంలో మొదటిసారి అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో కూడా ఇంత భారీ సంఖ్యలో అక్రమ వలసవాదుల తరలింపు జరగలేదని తెలుస్తోంది. గడచిన దశాబ్ద కాలంలో ఒక్క సంవత్సరంలోనే ఇంత భారీ సంఖ్యలో తరలింపులు జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రారంభమయ్యే అక్రమ వలసదారుల తరలింపులో ఈ 18వేల మంది భారతీయులు కూడా ఉండనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

