చండీగఢ్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ వ్యక్తిగత వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. (woman constable arrested) ఈ నేపథ్యంలో సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఆమె కూడబెట్టిన ఆస్తులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్‌లోని బటిండాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్ తన వాహనంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందింది.
కాగా, పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి కౌర్ డ్రైవ్ చేస్తున్న వాహనాన్ని భటిండాలోని బాదల్ ఫ్లైఓవర్ సమీపంలో అడ్డగించారు. తనిఖీ చేయగా గేర్ బాక్స్ వద్ద దాచిన 17.71 గ్రాముల హెరాయిన్ లభించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళా కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. అలాగే నిబంధనల ప్రకారం పోలీస్ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు.
మరోవైపు అమన్‌దీప్ కౌర్‌కు మహేంద్ర థార్‌తోపాటు ఆడి, రెండు ఇన్నోవా కార్లు, బుల్లెట్ బైక్, రెండు కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఖరీదైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా వాటిని కొనుగోలు చేసిందా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఆమెకు ఎవరైనా అధికారులు సహకరించారా? అన్న దానిపై కూడా దృష్టిసారించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.