ముంబై, డిసెంబర్ 4: ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. ఈ ఘటన ముంబైలో గత బుధవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బెదిరించారు.
పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తర్వాత లైంగికదాడికి పాల్పడ్డారు. సిగరెట్లతో ప్రైవేటు భాగాలపై కాల్చారు. వీడియో తీసి పోలీసులకు చెబితే సోషల్ మీడియాలో పెడతామని దుండగులు బెదిరించారు. అయితే సదరు మహిళ ఇంటి పక్కవాళ్లకు జరిగిన విషయం చెప్పడంతో చివరికి పోలీసులకు సమాచారం చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.