ముంబై : దేశవ్యాప్తంగా గత ఏడాది కాలంగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా స్కామ్‌తో ఆన్లైన్ అడ్డాగా బాధితులను నిండా ముంచుతున్నారు. ఇక లేటెస్ట్గా ముంబైకి చెందిన మహిళ దుబాయ్‌కు విమాన టికెట్లు బుక్ చేసే క్రమంలో స్కామర్ల బారినపడి ఏకంగా రూ. 4.4 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రముఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తూ స్కామర్ల చేతిలో ఆమె మోసపోయారు.
స్కామర్లు మోసపూరితంగా టికెట్ బుకింగ్ ప్లాట్‌పాం కాంటాక్ట్ నెంబర్ స్ధానంలో తమ నెంబర్లు రీప్లేస్ చేసి ఈ స్కామ్‌కు స్కెచ్ వేశారు. ముంబై జుహు ప్రాంతానికి చెందిన 64 ఏండ్ల గీతా షెనాయ్ ఆన్లైన్ టికెట్ ఎంక్వయిరీ కోసం ప్రముఖ వెబ్‌సైట్‌ను సంప్రదించగా అందులో ఉన్న ఫోన్ నెంబర్ ప్రకారం సంస్ధ ప్రతినిధితో మాట్లాడగా సదరు ప్రతినిధి ఆమెను తన ఫోన్లో ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు.
అతడి సూచనలకు అనుగుణంగా ఆమె యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగా డివైజ్‌ను కంట్రోల్లోకి తీసుకున్న స్కామర్ ఆమె ఫోన్ యాక్సెస్ తీసుకుని స్కామ్‌కు తెరలేపాడు. ఆపై ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 4.4 లక్షలను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. తన ఖాతా నుంచి రూ. 4.4 లక్షల విలువైన అనధికార లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన మహిళ మోసపోయానని గ్రహించి జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Guntur Karam | మహేష్ బాబుకు చుక్కలు చూపిస్తున్న ఆ ఒక్కడు.. ఎవరు?