Body Parts In Closet | తల్లిని హత్య చేసిన కుమార్తె.. మృతదేహాన్ని బాక్స్‌లో ఉంచి వాటర్ ట్యాంక్‌లో దాచిన వైనం
Body Parts In Closet | మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాల్బాగ్ ప్రాంతంలోని వీణా జైన్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఆమె కుమార్తె రింపుల్ జైన్‌ను పలు గంటలపాటు ప్రశ్నించారు. దీంతో తన తల్లిని హత్య చేసినట్లు ఆమె చెప్పింది. మృతదేహాన్ని ఎక్కడ దాచిందో కూడా వెల్లడించింది.
ముంబై: ఒక మహిళ తన తల్లిని హత్య చేసింది. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి స్టీల్ బాక్స్‌లో ఉంచి (Body Parts In Closet) వాటర్ ట్యాంక్‌లో దాచింది. మిస్సింగ్‌పై కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఛిద్రమైన మృతదేహాన్ని ఆ ఇంట్లో గుర్తించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ముంబైలోని లాల్బాగ్ ప్రాంతానికి చెందిన వీణా జైన్ నాలుగు నెలలుగా కనిపించడం లేదు. 23 ఏళ్ల కుమార్తె రింపుల్ జైన్ దీనిపై పట్టనట్లుగా ఉంది. దీంతో ఏదో జరిగి ఉంటుందని వీణా జైన్ సోదరుడు అనుమానించాడు. మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది నవంబర్ నెలాఖరు నుంచి తన సోదరి కనిపించడం లేదని తెలిపాడు.
కాగా, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాల్బాగ్ ప్రాంతంలోని వీణా జైన్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఆమె కుమార్తె రింపుల్ జైన్‌ను పలు గంటలపాటు ప్రశ్నించారు. దీంతో తన తల్లిని హత్య చేసినట్లు ఆమె చెప్పింది. మృతదేహాన్ని ఎక్కడ దాచిందో కూడా వెల్లడించింది. దీంతో పోలీసులు వాటర్ ట్యాంక్‌లో ఉన్న స్టీల్ బాక్స్‌ను బయటకు తీశారు. అందులో ప్లాస్టిక్ కవర్లో ఉన్న కుళ్లిన మృతదేహం అవశేషాలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె రింపుల్ జైన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో వీణా జైన్ మెట్ల నుంచి పడిపోయినట్లు పోలీసులకు తెలిసింది. అయితే ఆమెను కుమార్తె ఎందుకు హత్య చేసింది అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Man Kills Father | తండ్రిని హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీబ్యాగ్‌లో పడేసిన కొడుకు
Air hostess falls to death | బ్రేకప్ కోసం బాయ్ ఫ్రెండ్‌ను కలిసిన ఎయిర్ హోస్టెస్.. ఎత్తైన బిల్డింగ్ పైనుంచి పడి మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- body parts
- Closet
- Mother
- tank
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

