ముంబై, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పురుషునికి మత్తుమందు ఇచ్చి ఓ మహిళ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనను పెండ్లి చేసుకోవాలని, లేదా రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే రేప్ కేసు పెడతానని ఆమె బెదిరించింది. మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోత్రుడ్కి చెందిన నిందితురాలు (38) హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నట్టు ముంధ్వాకు చెందిన వ్యక్తి (37)తో పరిచయం చేసుకుంది.
బాధితుడి భార్య అతడిపై దాఖలు చేసిన కేసులో సాయం చేస్తానని చెప్పింది. ఫిర్యాదుదారుడికి మత్తు మందు ఇచ్చి వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి మూడు సార్లు అత్యాచారం చేసింది. అయితే, ఫిర్యాదుదారుడు ఆమెతో వివాహ ప్రతిపాదనను తిరసరించాడు. ‘నన్ను వివాహం చేసుకోకపోతే, నాకు రూ. 2లక్షలు ఇవ్వండి. లేకుంటే, నేను మీపై అత్యాచారం కేసు పెడతాను’ అని ఆమె బెదిరించిందని ఫిర్యాదులో బాధితుడు పేరొన్నాడు.