Watch: వేదికపై ఉదయనిధి ఉండగా.. పార్టీ కార్యకర్తను కొట్టిన డీఎంకే మంత్రి
తలపై టోపీ ధరించి ఉదయనిధిని కలిసిన ఒక కార్యకర్తను మంత్రి నెహ్రూ స్వల్పంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వేదికపై ఉండగా పార్టీ కార్యకర్తను డీఎంకే మంత్రి కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సేలంలో గురువారం డీఎంకే కార్యక్రమం జరిగింది. ఇటీవల మంత్రివర్గంలో చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఆయనను చూసేందుకు, కలిసి కరచాలం చేసేందుకు డీఎంకే కార్యకర్తలు పోటీపడ్డారు. క్యూకట్టిన కార్యకర్తలు వేదికపై ఉన్న ఉదయనిధి వద్దకు వరుసగా వచ్చి కలిశారు.
కాగా, ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలను నియంత్రించేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్ నెహ్రూ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయనిధి పక్కనే నిల్చొన్న ఆయన కార్యకర్తలు త్వరగా ముందుకు కదిలేలా వారిని లాగారు. ఈ నేపథ్యంలో తలపై టోపీ ధరించి ఉదయనిధిని కలిసిన ఒక కార్యకర్తను మంత్రి నెహ్రూ స్వల్పంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ నెలలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నెహ్రూ డీఎంకే కౌన్సిలర్‌ను చెప్పుతో కొట్టి వార్తల్లో నిలిచారు. అలాగే ఈ వారంలో పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి ఎస్ఎం నాసర్ తిరువళ్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు. తనకు కుర్చీ తీసుకురావడంలో జాప్యం చేసినందుకు పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ కూడా నాడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
Dear Tweeps , presenting you another thuggish behaviour by yet another dmk minister . From stone pelting to man handling ,this cabinet is full of raw talent . 👌People deserve this for electing this bunch ! pic.twitter.com/i5QFY3Bl07
— karthik gopinath (@karthikgnath) January 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

