న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ముగ్గురు నడుపుతున్నారని, అందులో ఒకరికి ఎలాంటి హోదా లేదని ఆ పార్టీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ విమర్శించారు. రాహుల్ గాంధీ తీరు, పార్టీ పరిస్థితిపై గురువారం ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లను ప్రస్తావించని ఆయన, కాంగ్రెస్లో సమస్యలకు మరో ఇద్దరితోపాటు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని అన్నారు.
పార్టీలో ఎలాంటి హోదా చేపట్టకుండా రాహుల్ గాంధీ కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని నట్వర్ సింగ్ తప్పుపట్టారు. ఇది సరైన విధానం కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లో సంక్షోభం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పార్టీ సీనియర్ల మధ్య లుకలుకల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడమే ఈ సమస్యలకు కారణమని ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా బుధవారం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
#WATCH | "…(Present situation of Congress) It's not alright at all, there are three people responsible, one of them is Rahul Gandhi who doesn't even hold any designation, and he is calling the shots…," says Former External Affairs Minister Natwar Singh pic.twitter.com/S7QIei0L29
— ANI (@ANI) September 30, 2021