న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పేరు రేసులో ప్రధానంగా వినిస్తున్నది. బీఎల్ సంతోష్ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా తావ్డేకు పేరున్నది.
అలాగే తెలంగాణకు చెందిన కే లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నది. రేసులో సునీల్ బన్సల్ పేరు కూడా వినిపిస్తున్నది. ఆయన తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ర్టాల ఇన్చార్జిగా ఉన్నారు. ఎంపీ ఓం మాథుర్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. మరోవైపు, పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ నియమితులయ్యే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి.