Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు (Winter Session Of Parliament) కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదించారు.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) శనివారం ప్రకటించారు. ‘పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1 నుంచి 19 వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు’ అని ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు.
Union Minister of Parliamentary Affairs, Kiren Rijiju, tweets, “The President of India, Droupadi Murmu ji has approved the proposal of the Government to convene the Winter Session of Parliament from 1st December 2025 to 19th December 2025 (subject to exigencies of Parliamentary… pic.twitter.com/gJ0F42HIDE
— ANI (@ANI) November 8, 2025
Also Read..
Air Pollution | ఢిల్లీలో అధ్వానస్థితిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ప్రజల ఇబ్బందులు
Ajit Pawar | అది ప్రభుత్వ భూమి అని నా కుమారుడికి తెలియదు.. భూ కుంభకోణంపై అజిత్ పవార్