న్యూయార్క్ : మైక్రోసాఫ్ట్ (Microsoft) చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ పనోస్ పనయ్ రెండు దశాబ్ధాల సేవల అనంతరం కంపెనీని వీడుతున్నారు. విండోస్ డెవలప్మెంట్ చీఫ్‌గా పనిచేస్తున్న పనయ్ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగుతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌లో 19 ఏండ్ల అద్భుత ప్రయాణం అనంతరం మరో పేజీకి మరలుతున్నానని, మరో అధ్యాయం లిఖించాలని నిర్ణయించుకున్నానని పనయ్ ట్వీట్ చేశారు.
పనయ్ త్వరలో అలెక్సా, ఎకో స్మార్ట్ డివైజ్‌ల బాధ్యతలను చేపట్టేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అడుగుపెడతారని భావిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అమెజాన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డేవ్ లింప్ స్ధానంలో పనయ్ ఆ బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఈ దిశగా అమెజాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.
ఇక 2004లో పనయ్ మైక్రోసాఫ్ట్‌లో గ్రూప్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా అడుగుపెట్టారు. ఆపై 2018లో ఆయన కంపెనీ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ స్ధాయికి ఎదిగి విండోస్ 11 క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో పనయ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోట్ కావడంతో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు సలహాలు ఇచ్చే అత్యున్నత బృందంలో ఒకరిగా ఎదిగారు.
Read More :