Somnath Bharti | ఎగ్జిట్ పోల్స్ తప్పు.. మోదీ మూడోసారి ప్రధాని అయితే గుండు చేయించుకుంటా: సోమనాథ్ భారతి
Somnath Bharti | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి (Somnath Bharti ) అన్నారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించుకుంటానని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి (Somnath Bharti ) అన్నారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించుకుంటానని ఆయన తెలిపారు. ఢిల్లీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్‌పై సోమనాథ్ భారతి పోటీ చేశారు. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో ఆప్ కలిసి పోటీ చేసిన ఇండియా కూటమి ఢిల్లీలోని ఏడు సీట్లు క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘మోదీ మూడోసారి ప్రధాని అయితే నేను గుండు చేయించుకుంటా. నా మాటను గుర్తించుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు అని జూన్ 4న రుజువవుతుంది. మోదీ మూడోసారి ప్రధాని కాలేరు. ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాలను ఇండియా కూటమి దక్కించుకుంటుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 350కుపైగా స్థానాలు వస్తాయని చాలా వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్ 150-170 సీట్లకు పరిమితమవుతుందని అంచనా వేశాయి.
I will shave off my head if Mr Modi becomes PM for the third time.
Mark my word!
All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.
In Delhi, all seven seats will go to India ALLIANCE.
Fear of Mr Modi does not allow…
— Somnath Bharti सोमनाथ भारती (@attorneybharti) June 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

